Post by CDMA_APGOV
312 followers
2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు; పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మరియు నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ గారు; రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, మండపేట ఎమ్మెల్యేలు; మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేశ్ కుమార్ గారు; కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి. సంపత్ కుమార్ గారు; ఇంజనీర్-ఇన్-చీఫ్ ప్రభాకర్ గారు; జాయింట్ డైరెక్టర్ ; రీజినల్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, మండపేట ప్రాంతాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, భక్తుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, శుభ్రత మరియు పారిశుధ్య ఏర్పాట్లపై విస్తృతంగా చర్చ జరిగింది. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, ఆరోగ్య సేవలు, శానిటేషన్ వ్యవస్థలు సమన్వయంతో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులకు సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పని చేయాలని స్పష్టం చేశారు. Nara Chandrababu Naidu Dr. Ponguru Narayana Narendra Modi Swachha Andhra Corporation Swachh Bharat Urban Ministry of Housing and Urban Affairs Manohar Lal Mou Sengupta Sureshkumar S Nair Sampath Kumar IAS Lokesh Nara #GodavariPushkaralu2027 #Pushkaralu2027 #AndhraPradesh #APGovt #APTourism #Infrastructure #Pilgrimage #CDMA #GodavariRiver #ReviewMeeting #PublicSafety #Sanitation #Development #Governance #GodavariGhats #SmartCity