Post by Bharat Aawaz

1,233 followers

ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.|"మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన 23 మంది పార్టీలో చేరిక.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన ఎంపీ ఈటల రాజేందర్" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జీహెచ్‌ఎంసీ 62వ వార్డు బాలాపూర్‌కు చెందిన లావుడియా రజిత ఆధ్వర్యంలో 23 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. బుధవారం షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి వారిని బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. #Sidhumaroju Alwal #Balapur #Bharataawaz #BJP #BJPJoining #EatalaRajender #Maheshwaram #Malkajgiri #PoliticalNews #Telangana #Telangana Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content