Post by Bharat Aawaz

601 followers

లైబ్రరీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంపీ వంశీకృష్ణ చొరవ*మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎంపీ గడ్డం మంచిర్యాల జిల్లా : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గత పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్ర లైబ్రరీని సందర్శించిన సందర్భంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల ఇబ్బందులను సానుకూలంగా స్పందించిన ఎంపీ, వెంటనే వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు,దీనిలో భాగంగా విద్యార్థులకు అవసరమైన వాష్‌రూమ్‌లు మరియు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేయగా, ఈరోజు వాటి పనితీరును సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలాగే మంచిర్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు, అదేవిధంగా పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ లో పోస్టులను పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు,విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. #Bharataawaz #LibraryFacilities #MancherialLibrary #MancherialNews #MPVamsiKrishna #StudentProblems #Telangana Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content