Post by Bharat Aawaz

549 followers

మాచర్ల రామ్మోహన్‌రావుపై దాడి హేయమైన చర్య: చేనేత నాయకులు.చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తున్న చేనేత నాయకుడు మాచర్ల రామ్మోహన్‌రావుపై జరిగిన దాడిని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తీవ్రంగా ఖండించారు. బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, భూ వివాదం నేపథ్యంలో రామ్మోహన్‌రావుపై విచక్షణారహితంగా దాడి చేయడం దుర్మార్గమని వారు అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా చేనేత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. #AttackCondemned #Bharataawaz #HandloomLeaders #MacherlaRammohanRao #WeaversProtest #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content