Post by Bharat Aawaz
1,245 followers
విద్యార్థులకు 455 ఉచిత నోట్ బుక్స్ పంపిణీ| నందిగామ శివారు డీవీఆర్ కాలనీలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 455 ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి బెంగళూరులో నివాసం ఉంటున్న నందిగామ వాస్తవ్యులు శ్రీ దేవత అనంత మురళీకృష్ణ దంపతులు, వారి పిల్లలు ఆర్థిక సహాయం అందించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీవైఈవో గురునాథం గారు విద్యార్థులకు వీటిని పంపిణీ చేసి, దాతల సేవాభావాన్ని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం గొప్ప సామాజిక సేవ అని నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు, ఎంఈవో పద్మ మరియు ఇతర ఉపాధ్యాయులు, అధికారులు ప్రశంసించారు. విద్యార్థుల్లో విద్యా ప్రోత్సాహానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుంది. #APNews #AryaVysyaSangham #Bharataawaz #EducationForAll #FreeNotebooks #GovernmentSchools #Nandigama #Philanthropy #SocialService #StudentSupport #telugunews #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!