Post by Bharat Aawaz
581 followers
విజయవాడలో ఏపీసీపీడీసీఎల్ నూతన కార్పొరేట్ కార్యాలయం ప్రారంభంవిజయవాడ గుణదల విద్యుత్ సౌధలో ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లతో కలిసి ప్రారంభించారు. రూ. 40 కోట్ల వ్యయంతో, 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘నెట్ జీరో’ విధానంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వినియోగదారులపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పీఎం కుసుమ పథకం ద్వారా రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ అందించే పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తూ, అంతరాయం లేని సరఫరా కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. #APCPDCL #APElectricity #Bharataawaz #GottipatiRaviKumar #Gunadala #Vijayawada #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!