Post by Bharat Aawaz
552 followers
పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు. సింగపూర్‌కు సీఎం చంద్రబాబు: పెట్టుబడులే లక్ష్యం! ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేడు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఉన్నతాధికారుల బృందం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, పలువురు మంత్రులతో భేటీ కానున్నారు. గూగుల్ క్లౌడ్, జీఐసీ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు జరపనున్నారు. అలాగే, 'వరల్డ్ సిటీస్ సమ్మిట్', విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొని, 16న తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. #APCMInSingapore #Bharataawaz #GlobalInvestments #LawrenceWong #MinisterNarayana #SurbanaJurong #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!