Post by Bharat Aawaz

554 followers

గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలో త్వరగా ఇవ్వాలి!పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం నిర్దేశించిన ఆప్షన్ ఫారమ్‌లను వెంటనే సమర్పించాలని చింతూరు ఐటీడీఏ పీఓ (Project Officer) శుభాంనోక్వల్ సూచించారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన ఈ ప్రకటన చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత సమర్పించే ఏ ఆప్షన్ ఫారమ్‌లను పరిగణనలోకి తీసుకోబోమని పీఓ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోతున్న గిరిజనేతర కుటుంబాలకు త్వరగా న్యాయం జరిగేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆప్షన్ ఫారమ్‌ల ఆధారంగానే నిర్వాసితులకు అవసరమైన ప్లాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ ఆప్షన్లను వెంటనే నమోదు చేసుకోవాలి. జాప్యం జరిగితే పునరావాస ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. # Yadagiri #AndhraPradeshNews #Bharataawaz #GovernmentEmployees #LatestNews #TribalWelfareOptionForm #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content