Post by Bharat Aawaz

1,240 followers

చట్ట వ్యతిరేక పనులపై రౌడీ షీటర్లకు ముద్దనూరు సిఐ వార్నింగ్|చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు...రౌడీ షీటర్లకు ముద్దనూరు సి.ఐ స్ట్రాంగ్ వార్నింగ్ జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు ముద్దనూరు సి.ఐ నగేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని కఠినంగా హెచ్చరించారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనరాదని స్పష్టంగా సూచించారు. పోలీసుల హెచ్చరికలను గౌరవిస్తూ మంచి ప్రవర్తన కొనసాగించాలని వారికి తెలియజేశారు. #AndhraPradesh #APPolice #Bharattawaz #CrimePrevention #LawAndOrder #Muddanur #MuddanurPolice #PublicSafety #RowdySheeters #StrictAction #PoliceWarning #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content