Post by Bharat Aawaz
1,272 followers
పోలవరం: గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు|పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ప్రమాద వశత్తు నీటిలో గల్లంతు కాగా అంతరం చేపట్టి గాలింపు చర్యల్లో మృత దేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల, ఊకె లక్ష్మీ, తుర్రం భారతీ, ఊకె రమేష్,బాసిబోయిన బాలరాజుగా గుర్తించారు. ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పురుషులుగా గుర్తించారు. మృత దేహాలులను గుర్తించిన అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో ఐదుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయల ముక్కున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ అప్పలరాజు తెలిపారు. గోదావరి నదిలో చేపలు వేటకు వెళ్లే ముందు తగ్గిన జాగ్రత్తలు పాటించాలని పోలీసులు మరియు అధికారులు తెలిపారు. # Yadagiri #AndhraPradesh #APNews #Bharataawaz #emergency #FishingAccident #Godavari #GodavariRiver #MissingPersons #Polavaram #SearchOperation #Tragedy #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!