Post by Bharat Aawaz

951 followers

మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.|మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు రాజశేఖర్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాజశేఖర్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఆర్చి (ARC) సమీపంలో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో రాజశేఖర్ స్పాట్‌లోనే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. #AccidentNews #AndhraPradesh #Bharataawaz #BreakingNews #CrimeNews #LatestNews #Madanapalle #PoliceInvestigation #Roadaccident #RoadSafety #TrafficSafety #Andhra Pradesh Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!

Post content